ePaper
Thursday, March 19, 2026

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రచార హోరాహోరీ – ఉత్సాహంలో ప్రజలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. రహమత్ నగర్‌లో నిర్వహించిన రోడ్‌ షో, కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ—

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజమైన ప్రజా ప్రభుత్వం నడుస్తోంది. గడచిన సంవత్సరంలో తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు పేదలకు అండగా నిలిచాయి. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం” అన్నారు.

అలాగే,

“పేదల కోసం పోరాడే కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజల మనోభిలాష. జూబ్లీహిల్స్‌ ఓటర్లు హస్తం గుర్తుపై ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని ఘనవిజయాన్ని అందించాలి” అని మంత్రి పిలుపునిచ్చారు.

ప్రచారంలో నినాదాలు, డప్పులు, యువత ఉత్సాహం ఈ ప్రాంతంలో ఎన్నికల వేడి మరింత పెంచాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!