ePaper
Saturday, September 5, 2026

బీజేపీ విద్వేష వైఖరి దేశానికి ప్రమాదకరం: పున్నా కైలాష్

నల్గొండ: బీజేపీ అనుసరిస్తున్న విద్వేష, విభజన రాజకీయాలు దేశ ఐక్యతకు ప్రమాదకరమని నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ విమర్శించారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వాని రాంలీలా మైదానంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల నిర్వహించిన సభలో మసీదులు, దేవాలయాలు, చిన్నచిన్న దుకాణాల సముదాయాలకు సంబంధించిన బాధితుల పక్షాన మాట్లాడారని తెలిపారు. అయితే అనంతరం బీజేపీ రాంలీలా మైదానాన్ని ‘శుద్ధీకరణ’ పేరుతో పాలు, నీటితో శుభ్రం చేయడం వారి విభజన వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఆందోళనకరమన్నారు. రాజ్యాంగ విలువలపై నమ్మకం లేని విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు పున్నా కైలాష్ నేతృత్వంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ నుంచి డీఈఓ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు సత్యాగ్రహ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్, ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి, మండల అధ్యక్షులు చింత ధనుంజయ్, ఎడ్ల ప్రవీణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ముంతాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!