ePaper
Saturday, September 5, 2026

నల్గొండ పట్టణ మనుమయ సంఘం అధ్యక్షుడిగా సలివోజు సైదాచారి

చీకటి వెలుగు నల్లగొండ,

పట్టణ మనుమయ సంఘం నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రవీంద్రనగర్‌లోని మనుమయ సంఘ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా సలివోజు సైదాచారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా భైరోజు ఆంజనేయులు, కోశాధికారిగా విశ్వనాథుల నర్సింహాచారి, ఉపాధ్యక్షుడిగా గడగోజు సత్యనారాయణచారి, సహాయ కార్యదర్శిగా చొల్లేటి శంకరాచారి ఎన్నికైనట్లు ఎన్నికల ప్రధాన అధికారి బహురోజు రాఘవాచారి తెలిపారు. ఎన్నికల అధికారులుగా దాసోజు బ్రహ్మచారి, శ్రీరామదాసు వెంకటాచారి వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్‌తో పాటు కపిపావాయి జంగాచారి, కాసోజు విశ్వనాథం, శంకరాచారి, బ్రహ్మచారి తదితరుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!