ePaper
Saturday, September 5, 2026

విద్యార్థులకు దిక్సూచి- ఏఐఎస్ఎఫ్ఘనంగా 91వ వార్షికోత్సవాలు

చీకటి వెలుగు నల్గొండ

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 91వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ నాయకులు న్యాయవాది మల్లేపల్లి ఆది రెడ్డి గారు జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తలలో నాలుక లాగా, నిరంతరం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని కొనియాడారు. 1936 లో ఆవిర్భావించి స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర వహించిందని అన్నారు. ప్రభుత్వాలు విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని అన్నారు.విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్, జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిత్యం కాషాయకరణ చేయాలని, ప్రైవేటీకరణ చేయాలని నూతన విద్యా విధానం తీసుకువచ్చిందని, వి బి ఎస్ ఏ బిల్లును తీసుకువచ్చిందని, ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు బనాయిస్తూ, విద్యార్థుల ని భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలను అనుమతులిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలో మూసివేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్య పరి రక్షణ కోసం విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అన్నారు.

జిల్లా ఉపాధ్యక్షులు సూర్య తేజ, పట్టణ నాయకులు శ్రీకాంత్, అరవిందు,మనోహర్,తేజ, సాయి, అరుణ్,తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!