ePaper
Wednesday, July 8, 2026

నల్గొండ పట్టణం 42వ వార్డు – 177వ బూత్‌లో SIR అవగాహన

చీకటి వెలుగు నల్లగొండ.

నల్గొండ పట్టణంలోని 42వ వార్డు, 177వ బూత్ పరిధిలో బూత్ లెవల్ ఏజెంట్ (BLA) శ్రీమతి హైమావతి గారు ఆధ్వర్యంలో, SIR జిల్లా కన్వీనర్ కంచర్ల విద్యాసాగర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వెళ్లి SIR (Special Intensive Revision) పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రజలకు తమ ఓటరు నమోదును ధృవీకరించుకోవాలని, 2002 ఓటరు జాబితా ఆధారంగా వివరాలను పరిశీలించుకోవాలని, అవసరమైతే ఓటరు వివరాలను సవరించుకొని పునఃనమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి అర్హులైన పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి గారు, 2 టౌన్ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నర్సింహ గారు, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు చింత ముత్యాలు రావు గారు, నల్గొండ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్ గారు, కనగల్ మండల అధ్యక్షులు పులకల భిక్షం గారు, 19వ వార్డు బీజేపీ నాయకులు సత్యనారాయణ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!