నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ (ఎస్‌హెచ్‌ఓ)గా ఎస్‌ఐ డి. సైదాబాబు బాధ్యతలు స్వీకరించారు.
గతంలో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, నిష్పక్షపాత వైఖరి, కఠిన చర్యలతో ప్రజలలో ప్రత్యేక గుర్తింపు పొందిన సైదాబాబు, ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రంతో పనిచేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments