చీకటి వెలుగు నల్లగొండ,
మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి తీవ్రమైన పేగు చీలిక, సెప్సిస్, బహుళ అవయవ సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 55 ఏళ్ల రోగి ప్రాణాలను కాపాడినట్లు యశోద హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి తెలిపారు. గురువారం స్థానిక శాలిని రెసిడెన్సిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన వుయ్యాల నర్సింహ అనే రోగి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు దిగువ భాగ నొప్పి,వణుకులతో కూడిన జ్వరం, ఆకలి లేకపోవడం,మల విసర్జన కాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతర ఆసుపత్రిలో లాపరోస్కోపిక్ అప్పెండిక్స్ శస్త్రచికిత్స అనంతరం పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మలక్పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. సమగ్ర వైద్య పరీక్షలు, స్కానింగ్, ల్యాబ్ పరిశోధనల అనంతరం రోగికి సెప్సిస్ విత్ ఎం ఓ డి స్ , సీకల్ పర్ఫొరేషన్ (పేగు చీలిక), అప్పెండిక్యులర్ అబ్సెస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోగి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో వెంటనే అత్యవసర శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
అత్యంత అరుదైన అత్యాధునిక అత్యవసర శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడారు.
డా. వెంకటేష్ శ్రీపతి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆధ్వర్యంలో రోగికి
ఎమర్జెన్సీ ఎక్స్ప్లోరేటరీ లాపరోటమీ + రైట్ హేమికోలెక్టమీ + ఐలియోట్రాన్స్వర్స్ సైడ్-టు-సైడ్ అనాస్టమోసిస్
ఈ శస్త్రచికిత్సను జనరల్ అనస్థీషియా కింద విజయవంతంగా నిర్వహించారు.అత్యంత ప్రమాదకర అత్యవసర శస్త్రచికిత్స అనంతరం రోగి విజయవంతంగా కోలుకున్నాడు, ఈ సమావేశంలో డాక్టర్ కళాధర్ డాక్టర్ గుప్తా శశిధర్ రెడ్డి ఆసుపత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్,యూనిట్ హెడ్ కే శ్రీనివాసరెడ్డి,చిదుర శ్రీనివాస్, ఏ వాసు కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments