ePaper
Thursday, June 4, 2026

మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ కార్పొరేషన్‌లోని 10, 11, 31, 32, 33, 34, 41వ డివిజన్‌లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలని సూచించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, రానున్న రోజుల్లో నల్గొండ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

అన్ని డివిజన్‌లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఇతర సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తున్నామని మేయర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్, 10వ డివిజన్ కార్పొరేటర్ పిల్లి కృష్ణంరాజు, 31వ డివిజన్ కార్పొరేటర్ కౌసర్, 33వ డివిజన్ కార్పొరేటర్ రేగట్టే అండాలు లింగస్వామి, 34వ డివిజన్ కార్పొరేటర్ ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, జానయ్య, నాయకులు దోనాల నాగార్జున రెడ్డి, నకిరేకంటి సైదులు, ఏడుదొడ్ల వెంకట్రాం రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!