ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
షూటింగ్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సెట్‌లో ఏర్పాటు చేసిన టెంట్లు, కొంత షూటింగ్ సామగ్రి దెబ్బతిన్నాయి.
ఈ ఘటనలో యూనిట్‌కు చెందిన ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో వెంటనే చికిత్స అందించారు.
ప్రమాద సమయంలో హీరో ప్రభాస్ సెట్‌లో లేనట్లు సమాచారం. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.
అగ్నిప్రమాదం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయినా, త్వరలోనే మళ్లీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments