ePaper
Thursday, April 9, 2026

సత్యసాయి శతజయంతి వేడుకల్లో చలివేంద్రం ప్రారంభం

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలలో భాగంగా నల్లగొండలో శ్రీ సత్యసాయి చలివేంద్రం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి 30వ డివిజన్ కార్పొరేటర్ నవీన్ కుమార్ గౌడ్, వ్యాపారవేత్తలు యాదగిరి, వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సత్యసాయి సేవ సమితి నల్గొండ కన్వీనర్ పున్న విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చలివేంద్రం ద్వారా బాటచారులకు చల్లటి మంచినీరు, మజ్జిగ, దద్దోజనం పంపిణీ చేశారు.

గత 20 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా సేవాదళ సభ్యులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!