తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణారావు పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆమోదిస్తూ ఆయనకు మూడు నెలల పాటు పదవీ కాలాన్ని పొడిగించింది.
ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సమాచారం. రాష్ట్ర పరిపాలనలో కొనసాగుతున్న కీలక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని అభ్యర్థించగా, కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో రామకృష్ణారావు మరికొంతకాలం రాష్ట్ర పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో స్థిరత్వం కొనసాగించేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments