నల్లగొండ, ఫిబ్రవరి 24:
ఫిబ్రవరి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మరియు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 పోటీలలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో మెడల్స్ సాధించారు. వారి విజయాలతో జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మెడల్స్ సాధించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి, వారికి మెడల్స్ అందజేశారు. విధి నిర్వహణలో మాత్రమే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
యాదాద్రి జోన్-V పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ క్రీడా పోటీలలో పాల్గొని పలు మెడల్స్ సాధించడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాము, ఆది రెడ్డి, నాగరాజు, ఆర్.ఐలు శ్రీనివాస్, సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments