ePaper
Monday, March 2, 2026

‘తెర వెనుక ఏదో జరిగింది’ – అజిత్ పవార్ మృతిపై సంజయ్ రౌత్ షాక్ వ్యాఖ్యలు

ముంబై:

ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి వ్యవహారంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మృతి అత్యంత అకస్మాత్తుగా, అనుమానాస్పదంగా జరిగిందని పేర్కొన్న ఆయన, “తెర వెనుక ఏదో జరిగింది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అజిత్ పవార్ మృతిపై ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన వివరణలు స్పష్టంగా లేవని, ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని సంజయ్ రౌత్ అన్నారు. ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత మృతి నేపథ్యంలో, సంజయ్ రౌత్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారం మరింత మలుపులు తిరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!