ePaper
Monday, March 16, 2026

ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి : SPS అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు కార్మికుల సమస్యలపై SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెల్త్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ డా. జే. అజయ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న సుమారు 17,000 మంది కార్మికుల జీవనోపాధిపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని రాష్ట్ర అధ్యక్షులు కోరారు.

కాంట్రాక్టు వ్యవస్థ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం ద్వారానే నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26,000/- ఇవ్వాలని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి కింది డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.

ప్రధాన డిమాండ్లు:

కాంట్రాక్టు–దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ప్రతి కార్మికుడికి నెలకు రూ.26,000/- వేతనం ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి ESI కార్డులు అందించాలి. కార్మికుడి వేతనం నుండి డబుల్ PF కట్ చేయకుండా, ఒక భాగం కార్మికుడు, మరో భాగం ప్రభుత్వం చెల్లించాలి. ప్రస్తుతం ఉన్న 4 సెలవులతో పాటు అదనంగా 2 క్యాజువల్ లీవులు (CL) కల్పించాలి. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. విధి నిర్వహణకు వస్తూ లేదా విధి అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తూ కార్మికుడు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.

ఈ డిమాండ్లపై స్పందించిన హెల్త్ కమిషనర్ డా. జే. అజయ్ కుమార్ గారు, 2022 తర్వాత వేతనాల్లో ఎలాంటి పెరుగుదల జరగలేదని, ప్రస్తుతం వేతనాల పెంపునకు అవకాశం ఉందని తెలిపారు.

కార్మికుల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి తప్పకుండా న్యాయం చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు.

కనీస వేతనాల పెంపు జరగకపోతే, రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మహా ధర్నాకు పిలుపునిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

రాష్ట్ర అధ్యక్షులు – కుర్రి సైదయ్య

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – చిన్న బొస్కా నరేష్

రాష్ట్ర సహాయ కార్యదర్శి – రమా

రాష్ట్ర కార్యదర్శి – అంజలి

రాష్ట్ర కమిటీ సభ్యులు – నాగరాజు, ప్రవీణ్, మాతంగి అనిల్ కుమార్, నరేష్, కుమారి, రేణుక, సైదులు, రాజేందర్, శివ పవన్


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!