ePaper
Monday, March 16, 2026

జపాన్ మాజీ ప్రధాని హత్య: దుండగుడికి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్

టోక్యో | అంతర్జాతీయ వార్తలు:

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను హత్య చేసిన నిందితుడికి జపాన్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచార సభ సందర్భంగా అబేను కాల్చి చంపిన ఘటన జరిగి మూడు సంవత్సరాలన్నర తర్వాత ఈ తీర్పు వెలువడింది.

2022లో జరిగిన ఈ దారుణ ఘటన జపాన్‌ను తీవ్రంగా కుదిపేసింది. అత్యంత కఠిన భద్రతా వ్యవస్థ ఉన్న దేశంగా పేరున్న జపాన్‌లో, బహిరంగ సభలో మాజీ ప్రధాని హత్య జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడిపై విచారణ పూర్తిచేసిన కోర్టు, అతడి నేరం అత్యంత ఘోరమైనదని పేర్కొంటూ జీవిత ఖైదు విధించింది.

అబే హత్య ఘటన జపాన్ రాజకీయ వ్యవస్థతో పాటు భద్రతా ఏర్పాట్లపై పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కేసు తీర్పుతో బాధిత కుటుంబానికి కొంతమేర న్యాయం జరిగిందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!