ePaper
Monday, March 16, 2026

ముగిసిన ఆగ్రో ఎంప్లాయిస్ క్రికెట్ పోటీలు..

నల్లగొండ సీడ్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంప్లాయిస్ క్రికెట్ టోర్నమెంట్ మేకల అభినవ్ స్టేడియం లో రెండో రోజు ఆహ్లాదంగా జరిగి క్రీడల ముగింపు బహుమతి ప్రధానం నిర్వహించారు జిల్లా నుండి 16 టీంలు పాల్గొనడం జరిగిందని నల్లగొండ సీడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సైదులు తెలిపారు. మొదటి బహుమతి మిర్యాలగూడ టీం గెలుపొందగా రెండో బహుమతి హాలియా టీం విజేతలుగా నిలిచారని, మొదటి బహుమతి 25వేల రూపాయల ఎరిస్ ఆగ్రో కంపెనీ వారు అందజేశారు, మెమెంటోలను దక్కన్ ఆగ్రో కెమికల్స్ వారు రెండో బహుమతి 15 వేల రూపాయలను సుపీరియర్ కంపెనీ వారు అందజేయగా మేమంటోలను కనకదుర్గ ఫెర్టిలైజర్స్ కొత్తపల్లి వారు అందజేశారు. సీడ్ కంపెనీ ప్రతినిధులు నాగేశ్వరరావు పగిడి విగ్నేశ్వర్, లు సహాయ సహకారాలు అందించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేస్తామని, ఇదేవిధంగా సోదర భావంతో ఉద్యోగులు కలిసి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆగ్రో ఎంప్లాయిస్ అధ్యక్షులు సాంబశివరావు, శ్రీనివాసులు, శ్రీకాంత్, లక్ష్మణ్ సంజీవ, సురేష్, సతీష్, నరసింహ, రమేష్ హరీష్ , నాగార్జున రెడ్డి నర్సిరెడ్డి, కృష్ణ ,జావిద్, మధు, పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!