ePaper
Tuesday, March 17, 2026

గాంధీ భవన్‌లో తెలంగాణ గిరిజన శాఖ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం

చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

హైదరాబాద్:

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ కాంగ్రెస్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్‌తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి (BLR), కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా కమిటీ పనిచేయాలని సూచించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!