బ్రాహ్మణవెల్లంల
సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్‌సీ డీడీ గారి ఆదేశాల మేరకు బ్రాహ్మణవెల్లంల యందు ఎస్‌సీ బాలికల వసతి గృహంలో హాస్టల్ విద్యార్థినీలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినీలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. రంగురంగుల ముగ్గులతో వసతి గృహ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారిణి కె. రాధా కుమారి మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో ఒత్తిడిని తగ్గించి, వారి సృజనాత్మకతను పెంపొందించి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వసతి గృహ సిబ్బంది మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments