పావన్ కళ్యాణ్‌కు హెలిప్యాడ్ వద్ద స్వాగతం
కొండగట్టు అంజన్న ఆలయంలో టీటీడీ కేటాయించిన రూ.35.19 కోట్లతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పావన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద తెలంగాణ నాయకులు పావన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తయితే భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని నాయకులు తెలిపారు.
భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలయ మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిర్మాణాలు ఉపయోగపడనున్నాయని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments