ePaper
Saturday, September 5, 2026

ఘనంగా బోనాల పండుగ

చీకటి వెలుగు నల్గొండ.

శ్రావణ మాసం తొలిరోజు ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగాయి. నల్గొండ నగర పరిధిలోని 28 వ డివిజన్ లో గురువారం బోనాల పండుగ నిర్వహించగా నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 28 వ డివిజన్ లోని యాదవ సంఘం నుంచి ప్రారంభమైన బోనాలు మేళా తాళాలు, డప్పు సప్పుడులు, డీజే సౌండ్ ల ఊరేగింపుగా సాగి ముత్యాలమ్మ తల్లికి బోనాలు పెట్టి సాకా పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, డివిజన్ కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న యాదవ్ , గుండెబోయిన మల్లయ్య యాదవ్ , యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!