ePaper
Tuesday, March 17, 2026

విజయవంతంగా సైకిల్ రైడ్…

ఏపీ & తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (AP&TBEF) ఆధ్వర్యంలో ప్రజా రంగ బ్యాంకుల పరిరక్షణ, సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన “జన జాగృతి యాత్ర – సైకిల్ రైడ్” విజయవంతంగా కొనసాగుతోంది.
హైదరాబాద్ నుండి ఈరోజు మొదలైన ఈ యాత్ర నేడు చౌటుప్పల్ మీదగా నల్లగొండ చేరుకుంది, సుమారు 800 కిలోమీటర్లు, జిల్లా నుండి జిల్లా, ప్రజల మధ్యకు వెళ్లేలా కామ్రేడ్ ఉమా మహేష్ సైకిల్ రైడ్‌ర్ నిర్వహిస్తున్న ఈ యాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5.00గ.లకు నల్లగొండ లోని క్లాక్ టవర్ సెంటర్ కు యాత్ర చేరుకుంటుంది
ఈ సందర్భంగా AP&TBEF నాయకులు, నల్లగొండ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కత్తుల ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ
ప్రజా రంగ బ్యాంకులను బలహీనపరచే విధానాలకు వ్యతిరేకంగా, బ్యాంకింగ్ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా,ప్రభుత్వ రంగా బ్యాంకులను ప్రైవేట్ పరం చేయకుండా, IBA ఒప్పుకున్నా ఐదు రోజుల పని దినాలు అమలు అయ్యేలా, ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రకు ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి లభిస్తున్న విశేష స్పందన ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు A.రాజశేఖర్ , గణపతి యాదయ్య, రాజు,ఆంజనేయులు ప్రియాంక, సంధ్య, హేమ,M.స్వామి, శ్రీనివాస్, ప్రవీణ్, నాగార్జున, యాదగిరి, రఫి, మరియు రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!