ePaper
Thursday, March 19, 2026

మామిడాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంలో మంత్రి గారు మాట్లాడుతూ,

“రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతన్నలకు ఎలాంటి కష్టం రాకుండా, కంటికిరెప్పలా కాపాడుతున్నాం” అని అన్నారు.

అంతేకాక, రైతులతో వ్యక్తిగతంగా సంభాషించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా, జాప్యం లేకుండా, నష్టాలు లేకుండా జరుగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

— రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, రైతుల బలమే రాష్ట్ర బలం


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!