e-paper
Thursday, January 29, 2026

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేయాలి.

మాజీ ఎమ్మెల్సీ దేవి శ్రీ ప్రసాద్

రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను వర్తింపజేయాలని తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ దేవి శ్రీ ప్రసాద్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయాలలో బ్రాహ్మణుల ప్రాధాన్యత తగ్గుతుందని సరైన ప్రాతినిధ్యం లేదని పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులంతా ఐక్యమై బ్రాహ్మణుల హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ పాలనలో బ్రాహ్మణ భవన్ నిర్మించారని,ధూప దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించిందని, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలన్నారు, ప్రభుత్వం ఆలయాలలో పనిచేసే అర్చకుల ను పర్మినెంట్ చేయాలని కొత్త నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోరారు.బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా బ్రాహ్మణుల అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ తో ఆత్మీయ సమావేశం నిర్వహించి బ్రాహ్మణుల ప్రాధాన్యతను పెంచే విధంగా చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ నుండి బ్రాహ్మణులు పోటీ చేసిన తాము మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని అన్నారు. అలాగే రాజకీయాలలో బ్రాహ్మణుల ప్రాధాన్యతను పెంచే విధంగా సంఘం సహకరిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో బ్రాహ్మణుల కోసం ఒక భవన నిర్మాణం చేపడుతున్నామని బ్రాహ్మణులలో ఎవరైనా కిరాయి ఇళ్లలో ఉండి చనిపోతే అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉంటుందని బ్రాహ్మణ సంఘం భవనం నిర్మిస్తున్నామని అo దుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారని త్వరలోనే భవన నిర్మాణం చేపడతామన్నారు. ఈ సమావేశంలో కో కన్వీనర్లు మంత్ర వాది శ్రవణ్ కుమార్. అభిలాష్. పొలిటికల్ కన్వీనర్ యమునా పాఠక్, నీరజ,వింజమూరు మనోహర్రావు,చక్కిలం వేణుగోపాలరావు,ఉమ్మడి జిల్లాల నుండి అనేకమంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!