అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుని పనిచేస్తున్న మంత్రి
ఎల్లమ్మగూడెం కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా మాత్రమే
ఎన్నికల ముందు ఇలాంటి చర్యలు మాజీ ఎమ్మెల్యే కంచర్లకు కొత్తేమీ కాదు
తీన్మార్ మల్లన్న చిల్లర పంచాయతీలలో జోక్యం
ఆయన తీన్మార్ మల్లన్న కాదు… “మాయదారి మల్లన్న”
మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ బీసీ నేతల హెచ్చరిక
⸻
నల్గొండ:
నల్గొండ నియోజకవర్గంలో బీసీ వర్గాలకు వివిధ పదవులలో అవకాశాలు కల్పించిన ఘనత పూర్తిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదేనని, నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, అలాగే పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రి ఎక్కడా జోక్యం చేసుకోలేదని, గ్రామాల్లో అభ్యర్థులను స్థానిక ప్రజలే ఎంపిక చేసుకుని గెలిపించుకోవాలని మాత్రమే సూచించారని స్పష్టం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి అభివృద్ధిని ధ్యేయంగా చేసుకుని పనిచేస్తున్నారే తప్ప చిన్న స్థాయి రాజకీయ వివాదాల్లో పాలుపంచుకోరని తెలిపారు. గత 20 ఏళ్లుగా బీసీలకు ప్రాధాన్యతనిస్తూ, ఎన్నికలు మరియు నామినేటెడ్ పోస్టుల్లో కూడా జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
గతంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్‌గా వెంకట్ నారాయణ గౌడ్‌ను రెండు సార్లు పదవిలో నిలబెట్టడమే కాకుండా, అనంతరం రాష్ట్ర మున్సిపల్ చాంబర్ అధ్యక్షుడిగా నియమించడంలో కూడా మంత్రిగారి పాత్ర కీలకమని వివరించారు.
ఎల్లమ్మగూడెం కిడ్నాప్ కేసు రాజకీయ నాటకం తప్ప మరేమీ కాదని వారు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదని అన్నారు.
ఎంఎల్సీ ఎన్నికల సమయంలో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కార్యకర్త మంత్రి ఆదేశాల మేరకు పనిచేశారని వెల్లడించారు.
ఇప్పుడు చిల్లర పంచాయతీ అంశాల్లో తీన్మార్ మల్లన్న జోక్యం చేసుకుని మంత్రి పై ఆరోపణలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు.
👉 “తీన్మార్ మల్లన్న నిజంగా బీసీలకు మద్దతుగా పోరాడితే మేమంతా ఆయనకు మద్దతుగా ఉంటాం. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై విమర్శలు చేస్తే మాత్రం సహించేది కాదు,” అని కఠినంగా హెచ్చరించారు.
🗨️ “ఆయన తీన్మార్ మల్లన్న కాదు… మాయదారి మల్లన్న” అని వ్యాఖ్యానించారు.
బడుగు బలహీన వర్గాల తరపున నిరంతరం పనిచేస్తున్న మంత్రి కోమటిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఇక సహించేది లేదని బీసీ నేతలు స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments