నల్లగొండ: నల్గొండ మెడికల్ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు.
రాష్ట్రంలో ఉన్న 35 మెడికల్ కళాశాలల్లో నల్గొండ మెడికల్ కళాశాలనే ఉత్తమ కళాశాలగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కళాశాల నిర్మాణం స్లాబ్ లెవెల్ వద్ద ఆగిపోయిందని, వెంటనే రూ.85 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసి ప్రారంభించామని వెల్లడించారు.
ప్రస్తుతం కళాశాలలో 350 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని పేర్కొన్నారు. రాకపోకల కోసం ఆటోలపై ఆధారపడుతూ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నామని, వారి సౌకర్యార్థం ప్రత్యేకంగా రెండు బస్సులను నెలలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి లేదా మేయర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కోర్సు పూర్తి చేసిన అనంతరం మానవత్వంతో వైద్యం అందించాలని విద్యార్థులకు సూచించిన మంత్రి, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments