ePaper
Monday, March 2, 2026

జిల్లాలో తొలిసారిగా బ్లైండ్ విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్ ప్రారంభం

నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో దృష్టి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్‌ను ప్రారంభించడం గర్వకారణమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ M A Hafeez Khan తెలిపారు.

గురువారం నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగాన్ని ఆయన ప్రారంభించారు. విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని, ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

బ్లైండ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాల్లో బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ-బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు, ప్రత్యేకంగా చదువుకునే విభాగం మరియు సహాయక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా గ్రంథాలయ సంస్థ వార్షిక బడ్జెట్ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం లభించింది. గ్రంథాలయాల అభివృద్ధి, పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, డిజిటల్ లైబ్రరీ విస్తరణ, భద్రతా చర్యలు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో పబ్లిక్ రీడింగ్ సెంటర్లను ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గ్రంథాలయ సెస్‌ను సకాలంలో చెల్లించాలని సూచించారు.

జిల్లాలోని ప్రతి గ్రంథాలయాన్ని సమగ్ర జ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్మన్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కార్యదర్శి బాలమ్మ, అనిల్ కుమార్, కృష్ణ, మోహన్, నరసింహారెడ్డి తదితర గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!