మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. జివి రమేష్ తెలిపారు. మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ బాధ్యతలను సమయపాలన పాటిస్తూ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మారుమూల గ్రామాల్లో ఉన్న పశువులకు టీకాలు సకాలంలో వేయాలని తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో ఉచిత గాలి కుంట వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కార్యక్రమంలో భాగంగా మహిళా ఉద్యోగులకు క్యారమ్స్, చెస్, మ్యూజికల్ చైర్ వంటి క్రీడలు నిర్వహించారు. అనంతరం మహిళా సిబ్బందిని ఆత్మీయంగా సత్కరించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటర్నరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజీముద్దీన్, కార్యదర్శి జానీ పాషా, అసోసియేట్ ప్రెసిడెంట్ సుజాత, ట్రెజరర్ నాగరాజుతో పాటు సభ్యులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments