ఉగాది మరియు పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగలను పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు, విద్యార్థి లోకానికి మరియు శ్రేయోభిలాషులకు SFI జిల్లా కమిటీ తరఫున ఎండీ ఆదిల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వారి నూతన సంవత్సరం ‘క్రోధి’ నామ సంవత్సర ఉగాది పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, షడ్రుచుల సమ్మేళనంలా జీవితంలో అన్ని అనుభవాలు సంతోషాన్ని అందించాలని ఆకాంక్షించారు.
అలాగే పవిత్రమైన రంజాన్ పండుగ సమాజంలో క్రమశిక్షణ, సహనం, ఐక్యతను పెంపొందించాలన్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి నెలకొనాలని కోరుకున్నారు.
ఈ రెండు పండుగలు మన సమాజంలో సోదరభావాన్ని మరింత బలపరచాలని, పరస్పర గౌరవాన్ని పెంచాలని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం కోసం SFI ఎల్లప్పుడూ ముందుంటుందని ఎండీ ఆదిల్ పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments