ePaper
Monday, March 2, 2026

యూపీ తర్వాత టైఫాయిడ్ మరణాల్లో తెలంగాణ రెండో స్థానం

దేశవ్యాప్తంగా టైఫాయిడ్ వ్యాధి తీవ్రతపై ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. టైఫాయిడ్ మరణాల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా టైఫాయిడ్ కారణంగా 1,075 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాల్లో 202 మంది తెలంగాణకు చెందినవారే కావడం గమనార్హం. అంటే దేశంలో నమోదైన ప్రతి ఐదు టైఫాయిడ్ మరణాల్లో ఒకటి మన రాష్ట్రంలోనే చోటు చేసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక టైఫాయిడ్ మరణాలు తెలంగాణలోనే నమోదయ్యాయి.

కాలుష్యమైన నీరు, పరిశుభ్రత లోపం, అవగాహన కొరవడటం వంటి కారణాల వల్ల టైఫాయిడ్ వ్యాప్తి పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివార్లలో ఈ వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!