తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) ఆధ్వర్యంలో ఏప్రిల్ 8, 2026 నుంచి చేపట్టనున్న సమ్మెలో భాగంగా నల్గొండ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ ధర్నాకు అన్ని యూనియన్లు మద్దతు తెలపగా, భారీ సంఖ్యలో ఆర్టిజన్ కార్మికులు, ఇతర కార్మికులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా TVAE JAC చైర్మన్ & కన్వీనర్లు చిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మార్చి 26న జరిగిన ధర్నా కార్యక్రమం విజయవంతమైందని, ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మరింత ఎక్కువ మంది పాల్గొనడం ఆనందదాయకమన్నారు.
బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్‌ను అమలు చేయడం అన్యాయమని విమర్శిస్తూ, వెంటనే వాటిని రద్దు చేసి APSEB రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆర్టిజన్ కాని కార్మికులను కూడా ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన యూనియన్ల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ధర్నాకు 327 యూనియన్ SPDCIL నల్గొండ డివిజన్ కార్యదర్శి పాండన్న హాజరై మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments