ePaper
Monday, March 16, 2026

పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందేమాతరం జాతీయ గీతం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిసరాల్లో, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు కలిసి వందేమాతరం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బంకిమ్ చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు చారిత్రాత్మక దినం గా నిలిచిపోతుందని, ప్రతి బాధ్యతగల పౌరుడి మనసులో దేశభక్తి భావనను మరింతగా బలపరిచే సందర్భమని తెలిపారు.

వందేమాతరం జాతీయ గీతానికి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆమె అన్నారు. కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతిష్టానలు, విద్యాసంస్థల్లో కూడా వందేమాతరం సామూహిక ఆలాపన జరిగిందని పేర్కొన్నారు.

జాతి, మత, కుల, ప్రాంతీయ భేదాలు కాకుండా, దేశం అంటే ఒకటే అని భావించే జాతీయ ఐక్యతకు వందేమాతరం గీతం ప్రతీక అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ మోతిలాల్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!