నల్లగొండ:
ఈరోజు రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీఎన్జీవోస్ నాయకులు, ప్రాథమిక సభ్యులు మరియు ఉద్యోగస్తులు వీటి కాలనీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నల్లగొండ టౌన్‌ను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చినందుకు గాను గౌరవ మంత్రివర్యులకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీఎన్జీవోస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ హోదాతో ఉద్యోగులకు HRA పెంపు, CCA, హౌస్ లోన్ పరిమితి పెంపు వంటి ప్రయోజనాలు చేకూరుతాయని టీఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా టీఎన్జీవోస్ డైరీ ఆవిష్కరణకు మంత్రివర్యులను ఆహ్వానిస్తూ, కార్పొరేషన్‌గా మారిన సందర్భంగా ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రిని కోరారు.
ఈ విషయాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చినట్లు టీఎన్జీవోస్ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి జే. శేఖర్ రెడ్డి,
నరసింహ చారి, విజయ్ కృష్ణ, డీఐ రాజు గోవర్ధన్ రెడ్డి, రణదేవే, సైదులు నాయక్, భాస్కర్ వెంకటరెడ్డి, సత్యనారాయణ గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్ యాదగిరి, రాజశేఖర్ రెడ్డి, శంకర్ రెడ్డి, సుమన్, బాలకృష్ణ, దుర్గయ్య, వెంకటపతి, నందు, యశ్వత్,
మహిళా నాయకులు సునీత, కమల, సుమలత, లక్ష్మి, సంధ్య, జ్యోతి, భాగ్యలక్ష్మి, సుజాత, విజయకుమారి,
అలాగే వీరాంజనేయులు, రవినాయక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments