ePaper
Thursday, March 26, 2026

టీజీక్యాబ్ 2026-27 బడ్జెట్‌కు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ (TGCAB) 26వ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు బ్యాంకు పర్సనల్ ఇన్‌చార్జ్ సురేంద్ర మోహన్, ఐఏఎస్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCBs) పర్సనల్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సనల్ ఇన్‌చార్జ్ చాహత్ బాజ్ పాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. అదేవిధంగా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.

సంబంధిత అన్ని ఏజెండా అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ, సహకార బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశం ద్వారా సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలమని అధికారులు అభిప్రాయపడ్డారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!