ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ కొత్త ధరలను అమలు చేసింది.
ప్రస్తుతం ఉన్న రూ.14.99 ప్లాట్‌ఫామ్ ఫీజుపై రూ.2.59 పెంచడంతో మొత్తం ఫీజు రూ.17.58కు చేరింది. ఈ పెంపు వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో వరుసగా ఫీజులు పెంచుతున్న స్విగ్గీ నిర్ణయంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, ప్యాకేజింగ్ ఫీజులు పెరిగిన నేపథ్యంలో ఈ తాజా పెంపు మరింత భారం మోపనుంది.
ఈ నిర్ణయంతో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments