ePaper
Tuesday, March 17, 2026

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై ఆకస్మిక దాడులు – రూ.12,000 జరిమానా విధింపు

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషేధించబడిన విషయం తెలిసిందే. అయితే, ఇంకా కొంతమంది వ్యాపారులు, దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్లాస్టిక్‌ కవర్లను ఉపయోగిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

దాడుల సందర్భంగా పలు దుకాణాల్లో నుండి నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేయబడగా, సంబంధిత వారికి మొత్తం రూ.12,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.

ఇకపై సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకంపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామంటూ మున్సిపల్‌ అధికారులు హెచ్చరించారు.

మున్సిపల్‌ కమిషనర్ మాట్లాడుతూ:

పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ప్లాస్టిక్‌కు బదులుగా పునర్వినియోగపరచగల వస్తువులను ఉపయోగించాలని శుభ్రమైన, పచ్చని నల్గొండను నిర్మించడంలో అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, ట్రేడ్ లైసెన్స్ టీంలు, మరియు మున్సిపల్ జవాన్లు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!