నల్లగొండ పట్టణంలో “సురభి హౌసింగ్ కాలనీ”ను ఘనంగా ప్రారంభించారు. సాగర్ రోడ్‌లో డాన్ బాస్కో కళాశాల పక్కనే 11 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రీమియం లేఅవుట్‌ను డిటిసిపి, ఆర్ఈఆర్‌ఏ అప్రూవల్‌తో రూపొందించారు.
ఈ కాలనీ ప్రారంభోత్సవాన్ని మేనేజింగ్ డైరెక్టర్లు మొహమ్మద్ బషీరుద్దీన్, మొహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ లేఅవుట్‌లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, పార్కులు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రారంభ రోజే బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రజలు భారీగా క్యూ కట్టగా, పలువురు ముందస్తు రిజర్వేషన్లు చేసుకున్నట్లు వెల్లడించారు.
నల్లగొండ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ పెట్టుబడిదారులకు మంచి అవకాశంగా మారుతుందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ విలువ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమేర్, బండారు ప్రసాద్, వంగూరి లక్ష్మయ్య, మహమ్మద్ అజీమ్ ఉద్దీన్, సైఫ్ ఉద్దీన్, చిన్నాల జానయ్య, సైదులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments