నల్లగొండ, నవంబర్ 2:
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 317 జీవో బాధిత ఉద్యోగులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎస్ ఎస్సీడిడి మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
టీఎస్ ఎస్సీడిడి ఎంఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నల్లగొండలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా టీఎన్జీవో కార్యదర్శి జె. శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ —
దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న 317 జీవో బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న 12 డీఎస్సీడీవో మరియు సూపరింటెండెంట్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని,
సోషల్ వెల్ఫేర్ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే సూపరింటెండెంట్ పోస్టులకు గెజిటెడ్ హోదా కల్పించాలని కోరారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న జె. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ —
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని,
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పిఆర్సి మరియు ఆర్థిక బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రణధీర్ మాట్లాడుతూ —
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లకు 1:1 బేసిక్ నిష్పత్తిలో పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమానికి టిజి ఎస్సీడిడి ఎంఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. జైపాల్ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఉమెన్స్ వింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్ రాజు,
హెచ్‌డబ్ల్యూఓ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ,
సలహాదారులు జె. సజన్ కుమార్, బి. గోపాలకృష్ణ, జి. సుధీర్, రహీముద్దీన్,
కోశాధికారి కే. జీవన్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇటికల వెంకటేష్, కె. సంపత్ కుమార్, శశికళ,
ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. సంజీవ,
ఫైనాన్స్ కన్వీనర్ శ్రీనివాస్ వెక్కిరాల,
కార్యవర్గ సభ్యులు ఎన్. చంద్రశేఖర్, ఆర్విఆర్ ప్రసాద్, రవి వర్మ విజయవర్ధన్, ఎ. రమేష్, హర్షవర్ధన్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమెన్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కే. లత,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. జైపాల్,
కార్యవర్గ సభ్యుడు విజయవర్ధన్ లకు నియామక పత్రాలను అందజేశారు.
తరువాత సమావేశానికి విచ్చేసిన అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
📍 ఫిఫ్త్ జోన్ కమిటీ ఏర్పాటు:
ఇదిలా ఉండగా, ఎస్సీడిడి ఎంఎస్‌ఏ ఫిఫ్త్ జోన్ కమిటీను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో యాదాద్రి జిల్లా సూపరింటెండెంట్ జ్యోతిర్మయి, కుమారస్వామి, డి. ప్రసాద్, రాధ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments