ePaper
Friday, March 27, 2026

శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా… ముత్యాల తలంబ్రాలతో మేయర్ దంపతులు

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణానికి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్లారు.

బాజా భజంత్రీల నడుమ తమ నివాసం నుంచి మేయర్ దంపతులు ఘనంగా బయలుదేరి దేవాలయానికి చేరుకున్నారు. ఆలయంలో భక్తి వాతావరణం నడుమ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. పండుగ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!