నల్గొండ జిల్లా సాలిగౌరారం మండలంలోని అకారం గ్రామంలో ఉన్న ఆది ప్రాచీన సూర్యాలయం అభివృద్ధి కోసం, 65వ సామాజిక మాధ్యమ ప్రతినిధుల ఆధ్వర్యంలో, అలాగే గ్రామానికి సమీపంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన ఉట్కూరి వెంకటేష్ నిర్వహిస్తున్న సామాజిక వేదిక సహకారంతో భారీ స్థాయిలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ పిలుపుకు ఆకారం గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా పెర్కకొండారం, పరిసర గ్రామాల ప్రజలు కూడా విస్తృతంగా స్పందించారు. గ్రామీయులు, పలు సామాజిక మాధ్యమ మిత్రులు, పత్రికా ప్రతినిధులు, యువజన బృందాలు కలిసి పెద్దఎత్తున పాల్గొన్నారు. మొత్తం నాలుగు వందల మందికి పైగా ఈ సేవా కార్యక్రమంలో తమ శ్రమను సమర్పించారు.
గ్రామానికి చెందిన బొద్దు శ్రీమ తన సత్కార భావంతో ముందుకు వచ్చి శ్రమదానానికి హాజరైన వారందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. ఆకారం గ్రామ యువతలో దుర్గా మరియు అతని స్నేహిత బృందం ఎంతో కష్టపడి సేవలు అందించారు.

ఈ సేవా కార్యక్రమం ప్రధాన లక్ష్యం వేల నూరేళ్ల ప్రాచీన త్రికూట సూర్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించడం. తెలంగాణలో నిర్మించబడిన మొదటి త్రికూట సూర్యాలయం ఇదేనని పెద్దలు వివరించారు. కాలక్రమేణా ఈ ప్రాచీన దేవాలయం శిథిల స్థితికి చేరింది. అంతేకాక కొందరు దుర్మార్గులు గర్భగుడిలోని విగ్రహాలను దొంగిలించడంతో దేవాలయం మరింత దెబ్బతిన్నది.
అయినా, ఈ ఆలయ శిల్పకళ వైభవం మాత్రం చెదరలేదు — నేటికీ సూర్యకిరణాలు గర్భగుడిలోకి నేరుగా ప్రవేశించడం ఈ దేవాలయ ఆర్కిటెక్చర్ ఔన్నత్యానికి నిదర్శనం.
ఈ ఆలయం అభివృద్ధి కోసం ఆకారం గ్రామస్థులు, సామాజిక మాధ్యమ మిత్రులు, భక్తులు నిరంతరం సహకారం అందిస్తున్నారు. దేవాలయం పట్ల ప్రజల్లో ఉన్న భక్తి, బాధ్యతాభావం శ్రమదానంలో స్పష్టంగా కనిపించింది.
కానీ ప్రభుత్వం ఈ ఆలయంపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత చారిత్రక ప్రాముఖ్యత గల ఆలయం నిర్లక్ష్యానికి గురవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు.
పెర్కకొండారం గ్రామానికి చెందిన ఉట్కూరి వెంకటేష్ ఈ దేవాలయం వివరాలు, అవగాహన సమాచారాన్ని తన సామాజిక వేదిక ద్వారా నిరంతరం పంచుతూ ప్రజలకు తెలియజేస్తున్నారు.
అకారం, పెర్కకొండారం గ్రామ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వం వెంటనే ఈ సూర్యాలయాన్ని చారిత్రక వారసత్వంగా గుర్తించి, వాయిదా పడిన అభివృద్ధి నిధులను విడుదల చేసి, ఈ 1100 ఏళ్ల ప్రాచీన సూర్యాలయం పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments