ePaper
Monday, March 16, 2026

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని మంత్రి కార్యాలయం ముందు ఎస్ఎఫ్‌ఐ ధర్నా

నల్లగొండ, నవంబర్‌ 4:

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్‌ఐ) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి జోరుగా వర్షంలోనూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్, జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ మాట్లాడుతూ,

“విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగాలని” డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల కపట ప్రేమ చూపిస్తోందని, కేవలం ప్రదర్శనాత్మక కార్యక్రమాలకే పరిమితమైందని వారు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నా, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని వారు ఆరోపించారు.

ప్రైవేట్‌ కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం బంద్‌ నిర్వహిస్తుంటే, ప్రభుత్వం విజిలెన్స్‌ దాడులతో వారిని వేధిస్తున్నదని శంకర్‌ తెలిపారు.

“విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసే పరిస్థితి తలెత్తుతోంది. ఉన్నత విద్యా వ్యవస్థను ప్రభుత్వం అణగదొక్కుతోంది. ఇప్పటికైనా పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు ఊరటనివ్వాలి” అని వారు డిమాండ్‌ చేశారు.

ఇక బకాయిలు విడుదల చేయకుంటే, స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుర్ర సైదా నాయక్‌, కోరే రమేష్‌, బుడిగ వెంకటేష్‌, ముస్కు రవీందర్‌, మారుపాక కిరణ్‌, మూడవత్‌ జగన్‌ నాయక్‌, ఎం.డి. అదిల్, సైఫ్‌, నవదీప్‌, న్యూమన్‌, రియాజ్‌, సాయి వెంకట్‌, అఖిల్‌, మహేష్‌ బాబు, కార్తీక్‌, సంపత్‌, వర్షిత్‌, రామలింగం, రాజేష్‌, మల్లేష్‌, సింహాద్రి, తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!