స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో వాటర్ క్రిమేషన్‌ను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ విధానాన్ని “ఆల్కలైన్ హైడ్రోలిసిస్” అని కూడా పిలుస్తారు.
ఈ పద్ధతిలో మృతదేహాన్ని నీరు మరియు రసాయనాల మిశ్రమంతో ప్రత్యేక విధానంలో విచ్ఛిన్నం చేస్తారు. సంప్రదాయ దహన సంస్కారాలతో పోలిస్తే ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుందని, పర్యావరణానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సంప్రదాయ దహన విధానాలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత పద్ధతులను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments