నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉక్కుమనిషి, భారతరత్న, మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో యూనిట్ మార్చ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఎన్.జీ. కాలేజ్ నుండి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వరకు జరిగిన ఈ మార్చ్‌లో గుజరాత్ రాష్ట్ర రాజ్యసభ సభ్యులు శ్రీ కేసరి దేవ్ సింగ్ ఝాలా గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఝాలా మాట్లాడుతూ,
“భారతదేశాన్ని ఏకీకృతం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి నేటికీ దేశాన్ని నడిపిస్తోంది. 516 సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడం ఆయన ధైర్యసాహసానికి నిదర్శనం. నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కూడా అదే స్ఫూర్తితో ఆత్మనిర్భర్ భారత్–శ్రేష్ఠ భారత్ కోసం కృషి చేస్తున్నారు. మనమందరం స్వదేశీ వస్తువులు వాడుతూ దేశ అభివృద్ధికి తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గడ్డం మహేష్, మిర్యాల వెంకటేశం, దాసోజు యాదగిరి చారి, బిపంగి జగ్జీవన్, అక్కనపల్లి బలరాం, పెరిక నరసింహ, నరేందర్ రెడ్డి, శాంతి స్వరూప్, మేకల అనిల్, నీహారిక నీరజ తార దేవి, కటకం శ్రీధర్, దాసరి వెంకన్న, దాసరి కృష్ణ, మంగళపల్లి కిషన్, ఏరుకొండ హరి, భైరు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ యూనిట్ మార్చ్‌లో ఎన్‌సీసీ, స్కౌట్స్ విద్యార్థులు, వివిధ కళాశాలల విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Related
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments