ePaper
Monday, March 16, 2026

సంక్రాంతి రద్దీకి చెక్.. హైదరాబాద్ వాహనాలకు దారి మళ్లింపు

చిట్యాల / నల్లగొండ జిల్లా:

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండుగ ముగించుకొని హైదరాబాద్ నగరానికి ఒకేసారి భారీగా వాహనాలు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, నేషనల్ హైవే–65 (విజయవాడ–హైదరాబాద్) పై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు.

చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

🚦 ట్రాఫిక్ దారి మళ్లింపు వివరాలు

1️⃣ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్

2️⃣ మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ → హైదరాబాద్

3️⃣ నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు:

నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65) → హైదరాబాద్

4️⃣ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు:

కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ → హైదరాబాద్

5️⃣ ఎన్‌హెచ్-65 (విజయవాడ–హైదరాబాద్) పై ట్రాఫిక్ జామ్ అయితే:

చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను మళ్లించడం జరుగుతుంది.

జిల్లా పోలీసులు సూచించిన ఈ మార్గాలను వినియోగించుకోవడం ద్వారా ఎన్‌హెచ్-65పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందని పోలీసులు విజ్ఞప్తి చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!