కొండమల్లేపల్లి
పోలీసులు అంటేనే కొంతమంది అదో విధంగా భావిస్తారు. కానీ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే ప్రజల రక్షణ కోసం రాత్రింబగళ్లు కష్టపడే నిజమైన సేవాధారులు వారు. ఖాకీ దుస్తులు కఠినత్వం మాత్రమే కాదు — మానవత్వం, సేవా భావానికి కూడా ప్రతీక అని నిరూపించిన వారు కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్ గారు.
కొండమల్లేపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలను లెక్క చేయకుండా, ప్రజల భద్రత కోసం ఎస్ఐ రమేష్ గారు గత రెండు రోజులుగా గ్రామపంచాయతీ, రెవెన్యూ, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమన్వయం చేస్తూ శ్రమించారు. గౌరుకుంట తండా, బాపూజీ నగర్, ఉప్పవాగు, దోనియాల, చిన్న అడిశర్లపల్లి వంటి గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా స్వయంగా సంఘటనా స్థలాలకు చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు.
నల్లకుంట చెరువు ప్రమాదం నివారణ
గత పది ఏళ్ల తర్వాత నిండిన నల్లకుంట చెరువు ప్రమాద స్థాయికి చేరుకుందని గుర్తించిన ఆయన, చెరువు తెగిపోతే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని గ్రహించి వెంటనే అలుగుద్వారా నీటిని మళ్లించే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా బైపాస్ మార్గం ద్వారా చెరువులోకి నీటిని సురక్షితంగా వెళ్లేటట్టు తాత్కాలిక మార్గం సృష్టించారు.
ఆయన ముందుచూపుతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజల భద్రత కోసం చూపిన తక్షణ స్పందన, ధైర్యసాహసం, సేవా భావానికి స్థానికులు ముక్తకంఠంతో అభినందనలు తెలుపుతున్నారు.
“ప్రజల రక్షకుడు – రియల్ హీరో” అని ఎస్ఐ అజ్మీరా రమేష్ గారిని ప్రజలు కీర్తిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments