ePaper
Saturday, April 4, 2026

నల్గొండలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం… ఐక్యతకు నాంది పలికిన బిషప్

నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం “రన్ ఫర్ జీసస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రజల ఐక్యతకు నాంది పలుకుతుందని తెలిపారు. ఐక్యత లేకపోతే ఏది సాధించలేమని, ప్రజలందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.

ప్రజల్ని రక్షించడానికి దేవుడు ముందుకు వచ్చాడని, అదే మానవత్వాన్ని మనమూ అనుసరించాలన్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా మానవత్వమే ప్రధానమని, “మానవసేవే మాధవసేవ” అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, టి.ఎస్. క్రిస్టోఫర్, జయజీవన్ ప్రకాష్, జేమ్స్, పాస్టర్ లవన్ కుమార్, ఎబినేజర్, జాన్ బాబు, దేవదాస్, సాలమన్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!