ఈ రోజు నల్లగొండలోని YRP ఫౌండేషన్ హాల్‌లో, రామగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1973 నుండి 1979 వరకు 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం YRP ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యాలుశాల రవిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.
సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొని, తమ ఆనందాన్ని, విద్యార్థి దశలోని జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ,
రామగిరి ప్రభుత్వ పాఠశాలను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అందరం కృషి చేయాలని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో YRP ఫౌండేషన్ చైర్మన్ యాలుశాల రవిప్రసాద్, వెంకటేశం, నేతి రఘుపతి, రవీంద్రనాథ్, రాఘవ, పురుషోత్తం, రాజేంద్రప్రసాద్, వరప్రసాద్, ప్రవీణ్‌కుమార్, యమ దయాకర్, పవన్, మేఘయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments