ePaper
Monday, March 2, 2026

డబ్బులు ఆలస్యం అయితే ఎన్నికల్లో బుద్ధి చెబుతాం: బీజేవైఎం నాయకుడు చరణ్ చొక్కళ్ళ

నల్గొండ

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీజేవైఎం నాయకుడు చరణ్ చొక్కళ్ళ డిమాండ్ చేశారు. వరి నాట్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు.

రైతులు సాగు కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని విమర్శించారు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే, రాబోయే స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి, హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా డబ్బులు వెంటనే జమ చేయాలని చరణ్ చొక్కళ్ళ కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!