ePaper
Friday, March 20, 2026

పుల్లంల వెంకట్ నారాయణ గౌడ్ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా

మాజీ మున్సిపల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ మాజీ చైర్మన్ పుల్లంల వెంకట్ నారాయణ గౌడ్ 77వ జన్మదిన వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను శాలువాలు కప్పి, పూలమాలతో సన్మానించారు.

వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మునుగోడు మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.

అలాగే కార్పొరేటర్లు ఎదుల్ల శ్రీధర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, రేగట్టే అండాలు, లింగస్వామి, నాగార్జున రెడ్డి తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ, ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!