ePaper
Saturday, March 21, 2026

పాతబస్తీ జామా మసీద్‌లో ఇఫ్తార్ విందు

ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా చివరి రోజు ఉపవాస విరమణ సందర్భంగా నల్గొండ పాతబస్తీ జామా మసీద్‌లో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యాసర్, అడ్‌నాన్, ఆఫ్ఫాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ అమీర్ హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఖలీల్, ఇబ్రహీం, హాజీ, నదీమ్, సమద్, ఇర్ఫాన్, ఖయ్యూం బేగ్ తదితరులు, మౌలానాలు మరియు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!