నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి గురుకుల పాఠశాల భారీ వర్షాలతో నీటమునిగిపోయింది. పాఠశాల ఆవరణలో నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పాములు, చెదులు వంటి విషజంతువులు పాఠశాల ఆవరణలోకి చేరడంతో భయాందోళన నెలకొంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తక్షణమే స్పందించి, బుధవారం కొమ్మేపల్లి గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల పరిస్థితిని స్వయంగా పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
కలెక్టర్‌తో పాటు దేవరకొండ ఏఎస్పీ మౌనికా, ఆర్డీవో రమణారెడ్డి, ఎంఆర్ఓ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో డేనియల్, ఆర్సీవో బాలరాం నాయక్ తదితర అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని యుద్ధ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టారు.
తర్వాత అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ సారత్ చంద్ర పవార్ కూడా పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విద్యార్థులకు తాగునీరు, ఆహారం, తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు పాఠశాల ఆవరణలోని వర్షపు నీటిని తొలగించే చర్యలు ప్రారంభించారు.

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments